పంచతంత్రం STORIES OF PANCHATANTRA—Mitra Labhamu (Gaining Friends) Ch.3

Panchatantram2Mitralabham600

పంచతంత్రం

STORIES OF PANCHATANTRA

IN SIMPLE TELUGU POEMS — TRANSLATION INTO ENGLISH

MITRA LABHAMU- GAINING FRIENDS-Chapter 3

§

[Continuing the Series of Original Poems on the Panchatantra by Chandra gaaru, is Chapter 3 of Mitra Labhamu. Chapters 1 & 2 can be found here.]

21.
నూక యాశతో భూమికి దిగుగ బోవ
బోయ బన్నిన వలలోన బోయి చిక్క
గంపెడాశతొ వస్తిమి గనికరించు
పరివారము రక్షించి బోవ నిమ్ము! 21
తాత్పర్యము
“నూకల మీద ఆశతో కిందకు దిగగా, బోయ వాడు పన్నిన వలలో చిక్కుకున్నాము. నీ మీద గంపెడాశతో వచ్చాము. కనికరించి నా పరివారాన్ని ముందుగా రక్షించు” అని గువ్వల రాజు పలికెను.

English: The King of Doves said thus. “Greedy to eat the grains on the earth, we flew down and got entangled in the net thrown by the wily hunter. Please rescue my subject with kindness”

Image result for panchatantra images

22.
తుదకు నీ బళ్ళ బిగువు తోడ కావు
నన్ను యనగ మూషిక రాజు నొచ్చు కొనియె
మొదలు రాజు గాదె తుదకు మిగుల బంట్లు
యనగ గువ్వ రాజు యిటుల నుడివె! 22
తాత్పర్యము
“నా పరి జనాన్ని కాచిన పిదప నా బధాలను కూడా తొలిగించు!” అని గువ్వల రాజు మూషిక రాజును వేడుకొనెను. అది విన్న మూషిక రాజు నొచ్చుకొని ఇటుల పలికెను. “మొదట రాజు ప్రాణాలు కాపాడి, తరువాయి పరిజనుల కాచుట పాడి కాదే?” అనగా గువ్వల రాజు ఇట్లు పలికెను.

English: “Finally, you can save me with the strength of your teeth.”, When the King of Doves said thus the King of Mice felt sad and said, “Oh! Friend! Is it not appropriate if the King is rescued first and then the subjects?”

23.
నమ్ము వారిని కాపాడి నన్ను గావు
రాజ ధర్మము కాదటె ప్రజల గావ
సేమ ముండెడి ప్రజలు రామ రక్ష
వారి బంధమ్ము తొలగించి వారి బంపు! 23
తాత్పర్యము
“నన్ను నమ్మిన వారిని కాచి నన్ను కాపాడు. ప్రజలను కాపాడుట రాజ ధర్మము కాదా? ప్రజల క్షేమమే కదా రాజులకు శ్రీ రామ రక్ష. ముందు వారిని కాపాడి పంపుము.”

“Is it not my duty to protect my subjects, as a King? They came with me having belief. The safety of people is as Rama’s blessing to the King”, so said the King of Doves. “So, you rescue them first and send them on their way”.

యనవుడు మూషిక రాజు వలను గల తాళ్ళను పళ్ళతో పట పట కొరికి చివరకు చిత్రగ్రీవుని కూడా విముక్తి చేసెను. 24

English: Hearing this, the King of Mice rescued all the doves including the King by cutting the net with his teeth,

25.
ఎలుక గువ్వ చెలిమి ఇటులుండ చూసిన
వాయసమ్ము కలుగు చెంత చేరి
మూషికుండ నేను మిత్రుడ గువ్వకు
నీదు స్నెహ మరసి నిన్ను వేడ! 25
తాత్పర్యము
గువ్వ, మూషికము చెలిమి కనులారా చూసిన వాయసము మూషికము నివాసమైన కలుగు వద్దకు వచ్చి, ” ఓ మూషిక రాజా! నేను చిత్రగ్రీవుని మిత్రుడను. మీ ఇరివురి స్నేహము చూసి ఎంతో సంతొషము కలిగింది. నీతో మైత్రి కొరి వచ్చాను” అని పలికింది.

Looking with happiness, the friendship of the Mouse and Dove, the Crow came to the rat hole and said thus. “ Oh! Hiranyaka! I am friend of Chitrgreeva. I was elated to see how close you two were. So I came here seeking your hand of friendship”

26.
కలుగు నుంచి వచ్చి కనుమ నన్ను కరుణ
యనగ మూషికమ్ము యిటుల నుడివె
నీదు నాదు జాతి కాదు మిత్రు లెపుడు
మైత్రి నీవు నేను మసలు టెటుల! 26
తాత్పర్యము
“కలుగు బయటికి వచ్చి నన్ను ఒక్క సారి చూసి పొమ్ము” అని వాయసము వేడుకొనగా, మూషికము ఇటుల పలికెను. “ఒయి! వాయసమా! నీకూ, నాకూ మైత్రి పొసగుటెటుల? మనది జాతి వైరము కదా? వాయసము, మూషికము చెలిమి చేయడమనేది కష్టము కదా?

“Please come out of your hole and see me” Then, the King of Mice said, “ Dear Crow! How can we be friends? Was there not enmity between our communities since days of yore? How can a mouse and crow be friends?”

27.
మమ్ము దినెడి జాతి మీదిగ యెటు నేను
నమ్మి నీదు యెదుట రాగలండ
యనగ వాయసమ్ము యిట్టుల బలికెను
నొచ్చు కొంటి చాల నీదు మాట! 27
తాత్పర్యము
మమ్మల్ని భక్షించే జాతి మీది కదా? నిన్ను నమ్మి ఎటుల బయటికి రాగలను?” అని మూషిక రాజు పలికెను. అది విన్న వాయసము, “మూషిక రాజా, నీ మాటలు నన్నెంతో బాధించాయి!”

“ Your people eat us. How can I believe you and come out? So said Hiranyaka from inside his hole. The crow replied, Oh! Friend! Your words troubled my conscience”

28.
మూషిక రాజు మరల నిట్లనియె.

The Mouse King further said.

తగిన వారి మధ్యె తగునుగ స్నేహము
మైత్రి యెటుల మనదు మధ్య చెప్పు
యనగ వాయసమ్ము యటులనె కానిమ్ము
మైత్రి లేక నేను మనగ లేను! 28
తాత్పర్యము
మూషిక రాజు ఇంకనూ ఇట్లు పలికెను. “స్నేహానికి ఇద్దరి మధ్యా సరియయిన లక్షణాలు ముఖ్యము కదా. మనవి విరుద్ధ స్వబావాలు” అనగా వాయసము అటులనే కానిమ్ము అని అచటనే కూర్చుండి పోయెను.

English: Friendship is possible where characters and cultures meet. We have characters that oppose each other” But the crow sat there on “Dharna”

29.
యనుచు వాయసమ్ము యకడనె కూర్చుండె
యపుడు యెలుక యిటుల బలికె బ్రేమ
అగ్నికాగు నీరు యగ్నియె జల్లార్చు
వైరి జాతి తోడ తగదు మైత్రి! 29
తాత్పర్యము
ఆ విధంగా కూర్చున్న వాయసముతో మూషికము ప్రేమతో ఇటుల పలికెను. ” వాయసమా! నీకు తెలియనిది కాదు. ఏ అగ్ని సహాయము తీసుకొని నీరు వేడెక్కుతుందో, అదే నీరు ఆ అగ్నిని చల్లారుస్తుంది. నిప్పూ, నీరూ వలెనే మనది వైరి జాతి, మన మధ్య స్నేహ మెలా పొసగుతుంది?

Observing that the crow was not moving the King of Mice said out of affection, “ How can fire and water together. Does the water that uses the fire to get hot, douse the same fire by using its inner character? How can we be friends?”

30.
నీవు బయటి కొచ్చి నన్నును జూడొకొ
కన కుండ యెటుల కోప పడెదు
చూసి చెప్ప రాదె చేటు ఏమి కలుగు
యనగ మూషికమ్ము యిటులను బలికెను! 30
తాత్పర్యము
పట్టు వదలని వాయసము ఇటుల వాపోయెను. “ఒక్క సారి కలుగు బయటకు వచ్చి నన్ను చూడవచ్చు కదా? చూడకుండగనే న్యాయాన్యాయాలు ఎలా నిర్ణయిస్తావు?” అనగా మూషిక రాజు ఇటుల పలికెను.

English: The adamant crow persisted. “Why don’t you come and see me and talk? How can you judge me without even seeing me?”

Image result for panchatantra images

31.
వైర ముండు రెండు విధమ్ముల జగమున
పుట్టు వైర మొకటి బుట్టగానె
విషయ వాంఛ తోడ వచ్చును మరి యొకటి
కుక్క పిల్లి యుండు కలిసి యెటుల! 31
తాత్పర్యము
“ప్రపంచంలో రెండు రకాల వైరాలుంటాయి. ఒకటి పుట్టుకతో వచ్చే జాతి వైరము. రెండోది విషయ వాంఛతో వచ్చే వైరము.కుక్క, పిల్లి కలిసి ఉండడం సాద్యమా?”

English: “There is two kinds of enmity in the world. One comes by birth. The other comes because of desires to own things. Is it possible for a cat and dog to live together?

32.
మృగరాజు మనునె మదపు టేనుగు తోడ
మనదు మధ్యె మైత్రి మొదలె లేదు
నీరు నిప్పు మధ్య నేస్త మెటుల
తిరిగిపొమ్ము వాదు తగదు నీకు! 32
తాత్పర్యము
“మృగరాజు మదపుటేనుగుతో స్నేహము చేయునా? మన మధ్య పుట్టుకతోనే వైరమున్నది. నీరు, నిప్పు కలిసి ఎలా ఉండగలవు? నా మాట విని వెను తిరిగి పొమ్ము”

“How can a Lion King and an elephant make friendship? How can water and fire live together? Hear my word and go back to your place”

33.
యనగ వినిన కాకి యిటులను బలికెను
మైత్రి కలుగు ఏడు మాట లాడ
నీవు యుండు కలుగు నీదు లోన
నన్ను బలుకరించు నీవు బ్రేమ తోడను! 33
తాత్పర్యము
అనగా విని వాయసము ఇటుల పలికెను.” ఏడు మాటలతో స్నేహం బలపడుందని పెద్దలు చెబుతారు. నువ్వు నీ కలుగులో ఉండు. నేను ఇక్కడే ఉంటాను. తియ్యని కబుర్లు చెప్పు. వింటాను.”

Hearing these words, the crow said “ elders say friendship is possible on exchange of seven words between two people. You stay in your hole. I will stay here. We can exchange sweet words without meeting each other also”

34.
యనగ చెప్ప కాకి ఎలుక సంతస మందె
కలుగు నండె యెలుక కాకి బయట
కధలు చెప్పగ దొడగె కాలమె దెలియక
నెయ్య మటుల బెరిగె నియతి తోడ! 34
తాత్పర్యము
ఈ విధంగా వాయసము పలుకగ విని ఆనంద పడిన మూషిక రాజు కలుగు లోపల నుంచి తియ్యని కధలు చెప్ప సాగెను.కాకి బయట నుంచే తిరిగి కబుర్లు చెప్ప సాగెను. ఈ విధంగా కాలమే తెలియ కుండా వారి మధ్య స్నేహ బంధము బలపడెను.

English: The King of Mice felt happy and started sweet conversation with the crow from inside his hole. The crow was talking in return staying outside only” Like this, the bond of friendship between them got strengthened by the day.

35.
కాకి తెచ్చి బెట్టె కలుగు చెంత దినుసు
ఎలుక దెచ్చి బెట్టె కలుగు నుంచి
నెయ్య మయ్యె వారి నడుమను యెంతయొ
యటుల యుండు గాదె యనగ బ్రేమ! 35
తాత్పర్యము
ప్రతి దినమూ వాయసము కలుగు చెంత తిను బండారాలు తెచ్చి పెట్టేది. మూషికము తన కలుగులో దాచుకున్న తిను బండారాలను తెచ్చి పెట్టేది.ఆ విధంగా వారి మద్య బలీయమైన స్నేహం ఏర్పడింది. అహా! ప్రేమ, స్నేహాలన్న ఇంత తియ్యగా ఉంటాయి కదా?

Every Day, the crow was bringing grains and other eatables and keeping near the hole. The mouse used to share her saved food with the crow. Thus, an unbreakable friendship bond developed between them. Is it not surprising how friendship develops even between born enemies?

§

Click here to buy this book today!

Panchatantram2Mitralabham600

About Chandra Mohanrao

An ex-banker, saw highs and lows in life, Presently spending time with children and grandchildren extensively traveling across India and Globe. Writing is a passion. Never did it for money, nor do I wish to do it. One critique and one word of appreciation is all what I want.