పంచతంత్రం STORIES OF PANCHATANTRA—Mitra Labhamu (Gaining Friends) Ch.6

పంచతంత్రం

STORIES OF PANCHATANTRA

IN SIMPLE TELUGU POEMS — TRANSLATION INTO ENGLISH

MITRA LABHAMU- GAINING FRIENDS-Chapter 6

§

[Continuing the Series of Original Poems on the Panchatantra by Chandra gaaru, is Chapter 6 of Mitra Labhamu. Chapters 1 & 2 can be found here, Chapter 3 here, Chapter 4 here , and Chapter 5 here. Today concludes Mitra Labhamu ]

మరియు నిటుల బలికె మూషిక రాజము
86.
భుక్తి పోయె నాదు శక్తి బోయె
నమ్మకంబు పోయె నా పరి జనులకు
కక్క మింగ లేక క్రుంగి పోతి ! 86
§
87.
భాగ్య మన్న నేమి భోద పడెను నాకు
కలిమి పోగ యెవరు కలిసి రారు
చక్కెరున్న చోటె చీమలు చేరును
కలిమి దోచు వాడె బలిమి కాడు! 87
§
88.
మూషికమ్ము పలికె మందరకము తోడ
కలిమి పోగ నేను కుమిలి పోతి
నమ్మి నట్టి జనులు నగుబాటు సేయగ
శత్రు నెదురు కొంటి శక్తి తోడ! 88
§
89.
దైవ మొక్కడుండు ధనము ధాన్యము నీగ
ప్రాప్త మెంతొ నేను పొందుటెంతొ
నిర్ణయించు నతడె నామ మాత్రమె నేను
బలము కూడ గట్టి పైకి దూకి! 89
§
90.
ఉట్టి పైన నున్న యతి తిండి చేరగ
జాగరూకు డైన జంగమయ్య
బుర్ర పగుల కొట్ట కర్ర విసిరె కక్ష
దైవ బలము తోడ తప్పు కొంటి! 90
§
91.
హిరణ్యకుడు తన హృదయ రోదన
దెలుప వాయసమ్ము జాలి పడెను
మందరకుడు చెప్పె మరి రెండు గాధలు
నీతి యున్న దందు రీతి గాను! 91
§
92.
ధనము యుండు డొకటె ఘనమంచు పొగిడేరు
పంచ కున్న వాడు పేద కాడె
పిసిని గొట్టు వాడు భావ మందున పేద
దాన గుణము లేని ధనియు పేదె! 92
§
93.
వాయసమ్ము పలికె మూషికు తోడను
మధుర భాష లాడు మిత్రు కంటె
చేదు నిజము పలుకు చెలికాడు శ్రేష్టము
కచ్చపమ్ము తోడ కలిమి మెండు! 93
§
94.
కశ్యపమ్ము యెలుక కాకియు యచటనె
కబురులాడు చుండె కొలని యొడ్డు
కాల మెరుగరాయె కలిమి చెలిమెయాయె
మిత్ర లాభ మొండు ముదము గూర్చ! 94
§

తాత్పర్యము
మూషిక రాజు హిరణ్యకుడు మరల ఇలా పలికెను. “నాకు భుక్తి పోయింది, శక్తి పోయింది. నేను నమ్ముకున్న, నన్ను నమ్ముకున్న నా సేవకులకు నాపై నమ్మకము పోయింది. నేను మింగ లేక, కక్క లేక కృంగి పోయాను. భాగ్యము కలిగి ఉండటమంటే ఏమిటో నాకు బోధ పడింది. కలిమిలో తోడు ఉన్న వారందరు లేమిలో దగ్గర్కు కూడా రారు. చక్కెర, బెల్లము ఉన్న చోటే చీమలు చేరతయాయంటారు కదా? ఇతరుల కలిమిని దోచుకొనే వాడే బలవంతుడు, నిజమే! మందరకమనే ఆ తాబేలుతో మూషికుడు ఇంకా ఈ విదంగా పలికెను. కలిమి యంతా పోగా నేను కుమిలి పోయాను. నమ్మిన పరిజనము నన్ను నవ్వుల పాల్చేసి పోగా, మొండి ధైర్యంతో శతృవుని ఎదుర్కొన్నాను. మనకు ధనము కాని, ధాన్యము కాని యియ్యడానికి దేవుడొకడుంటాడు. మనకు ప్రాప్తమెంతో, చివరకు దక్కేదెంతో దేవుడే నిర్ణయిస్తాడు. నేను నామ మత్రుడినే అని నిర్ణయించుకొని బలము కూడ గట్టుకొని పైకి దూకాను, ఎలాగైనా బైరాగి ఉట్టి మీద దాచిన ఆహారపదార్ధాలను చేరుకోవాలనే ధృడ సంక్ల్పంతో. అయితే జాగరూకుడైన బైరాగి తన చేతి లోని కర్రతో నా తల పగుల గొట్ట నెంచి గట్టిగా విసిరి వేసెను. దైవ బలంతో తప్పుకొని అరణ్యాలకు పారిపోయి వచ్చాను.
ఈ విధంగా మూషికుడు తన హృదయ విదారకమైన కధను చెప్పగా, అతని చిర కాల మితృడు, లఘు పతనకమనే వాయసము ఎంతో బాధ పడెను. మందరకుడనే కూర్మము మరో రెండు నీతి కధలను చెప్పి అందలి నీతిని వివరంగా బోధించెను. ” ధనము చేరగనే వందిమాగధులు చేరి చాలా ఘనంగా పొగుడుతారు. నిజానికి అతను ధనవంతుడెలా అవుతాడు? తనకున్న దానిలో పదిమందికీ పంచని వాడు పేదవాడే కదా? పిసింగ్షిక రాజు హిరణ్యకుడు మరల ఇలా పలికెను. “నాకు భుక్తి పోయింది, శక్తి పోయింది. నేను నమ్ముకున్న, నన్ను నమ్ముకున్న నా సేవకులకు నాపై నమ్మకము పోయింది. నేను మింగ లేక, కక్క లేక కృంగి పోయాను. భాగ్యము కలిగి ఉండటమంటే ఏమిటో నాకు బోధ పడింది. కలిమిలో తోడు ఉన్న వారందరు లేమిలో దగ్గర్కు కూడా రారు. చక్కెర, బెల్లము ఉన్న చోటే చీమలు చేరతయాయంటారు కదా? ఇతరుల కలిమిని దోచుకొనే వాడే బలవంతుడు, నిజమే! మందరకమనే ఆ తాబేలుతో మూషికుడు ఇంకా ఈ విదంగా పలికెను. కలిమి యంతా పోగా నేను కుమిలి పోయాను. నమ్మిన పరిజనము నన్ను నవ్వుల పాల్చేసి పోగా, మొండి ధైర్యంతో శతృవుని ఎదుర్కొన్నాను. మనకు ధనము కాని, ధాన్యము కాని యియ్యడానికి దేవుడొకడుంటాడు. మనకు ప్రాప్తమెంతో, చివరకు దక్కేదెంతో దేవుడే నిర్ణయిస్తాడు. నేను నామ మత్రుడినే అని నిర్ణయించుకొని బలము కూడ గట్టుకొని పైకి దూకాను, ఎలాగైనా బైరాగి ఉట్టి మీద దాచిన ఆహారపదార్ధాలను చేరుకోవాలనే ధృడ సంక్ల్పంతో. కాని జాగ్రత్త పరుడైన బైరాగి తన కర్రను విసిరి నా తల పగుల గొట్ట బోగా, ఎటులో తప్పుకొని అరణ్యాలకు పారి పోయాను.
ఈ విధంగా మూషికుడు తన కధను హృదయ విదారకంగా చెప్పగా విని, మిత్రుడు ఎంతో జాలి పడెను. మందరకుడు అన తాబేలు మరో రెండు నీతి కధలు చెప్పి అందులోని నీతిని వివరముగా చెప్పెను.ధనము చేరగానే వందిమాగధులు చాలా గొప్పగా పొగడుతారు. కానీ తన ధనాన్ని ఇతరులకు పంచని వాడు ధనవంతుడెలా అవుతాడు? వాడు పేదవాని కిందే లెక్క.
పిసినిగొట్టు వాడు భావ దరిద్రుడే కదా? దాన గుణము లేని ధనికుడు కూడా పేద వాడే.
ఈ మాటలు విన్న వాయసము “మిత్రమా! తియ్యని, పనికి మాలిన కబుర్లు చెప్పే స్నేహితుడి కంటే, చేదుగా ఉన్నా నిజము పలికే ఆప్తుడు మిన్న కదా? ఈ మందరకునితో చెలిమి చెయ్యి.”
ఆ తాబేలు, మూషికుడు, కాకి ఆ విధంగా గాఢమైన అనుబంధంతో స్నేహము చేస్తూ ఆ సరస్సు ఒడ్డునే కబురాడుకుంటూ కాలము తెలియకుండా గడుపుచుండిరి. వారి చెలిమే వారికి కలిమి అయ్యింది. మిత్ర లాభము ఎంతో ముదము గూర్చగా వారు ఆనందమున నుండిరి.

English: Hiranyaka, the mouse king, further said thus. “I lost my food. I lost my strength. My own subjects lost confidence on me (that I could provide them with food). I could neither digest nor throw up the insult. I understood the value of possessing wealth. When wealth is lost the kith and kin move away. They say that ants converge where there is jaggery/sugar. I understood that the one who loots wealth of others is strong. As my whole wealth was lost I got depressed. As my own subject left me as a laughing stock, I decided to face the enemy with stubbornness. There is God to provide us with wealth and food. What is due to us is provided by Him only. I am only a namesake. So thinking I jumped on the pot in which the sage kept his remnants of food. But the cautious sage threw his stick with an intention to break my head and kill me. I, by God’s grace, escaped unhurt and fled to the forests.

As the mouse told his story thus, the crow felt sad for him. The turtle told two moral stories and explained the moral therein clearly. He said,” The one who possesses wealth can not be called rich if he does not share it with others. The man who is reluctant to share is intellectually poor. One who does not have an intention to donate is the real poor.”

Hearing this the crow said, “My dear friend! It is always better to have a soul-mate who tells truth though sour, than having a friend who speaks sweetly but without conviction. You make friendship with my friend, the turtle”

Thus, the crow, the mouse and the turtle became bosom friends and were spending time in talking each other without knowing passage of time. Their friendship became their wealth. The gain of new friends made each very happy indeed.

§
95.
గడిచి పోయె నిటులె కతిపయ దినములు
మిత్రు లటులె కూడి ముదము నుండ
హరిణ మొకటి వచ్చె పరుగున వగరుచు
సూసి బెదిరి పోయి స్నేహితులును! 95
§
96.
వాయసమ్ము యెగిరె వృక్షము పైనకు
యెలుక దూరె చెంత కలుగు లోన
మందరకము మునిగె మడుగు లోపలకును
జింక కాచు టెటుల చింత తోడ! 96
§
97.
మిత్ర త్రయము యటుల మాటున డాగియు
చింత పడిరి చాల జింక గూర్చి
నీటి కొరకు పరుగొ వేటకాని భయమొ
హరిణి పరుగు తీయ కారణమ్ము! 97
§
98.
సరసు చెంత చేర హరిణి నిటు లడిగె
కొలను లోన దాగు కచ్చపమ్ము
ఆపదేమి వచ్చె యటుల పరుగు తీయ
యనగ హరిణి నిలిచి యిటుల బలికె! 98
§
99.
జింక తన పేరు చిత్రాంగు డనియెను
తనదు బాధ చెప్పె దీనము గను
వేట గాడు యమ్ము వేయ తప్పుకొని వేగ
పరుగు తీసి వస్తి మరుగు కొరకు! 99
§
100.
వలయు నాకు యిపుడు నెలవు దాగు కొనగ
యనగ కశ్యపమ్ము యిటుల బలికె
శాస్త్రములలొ కలవు సూత్రములు యరయ
జింక యడిగె యాస చెప్పు మనుచు! 100
§
101.
చెప్పె కూర్మ రాజు శాస్త్ర సారములను
పోర వలయు శత్రు బలిమి తోడ
పారి పోగ వలయు పోరి నిలువకున్న
పారి పొమ్ము కావ ప్రాణములను! 101
§
102.
వాయసమ్ము పలికె వేటగాడు వెడలె
చెట్టు పైన నుంచి చూస్తి నేను
వేట పూర్తి చేసి వెనుకకు మరలెను
చింత మాని మాదు వెంటె యుండు! 102
§
103.
కొలని కశ్చపమ్ము కలుగులొ యెలుకయు
వాయసమ్ము మాట వినిన యంత
చెలిమి చేసి జింక చింతను పోగొట్టె
కాల మెరుగరాయె కబురు లందు! 103
§

తాత్పర్యము
ఈ విధంగా కొన్ని దినములు యానందముగా గడిచి పోగా, ఒక రోజు ముగ్గురు మిత్రులు కొలను ఒడ్డున కబుర్లాడుకుంటూ ఉండగా ఒక జింక భయంతో పరుగిడు కుంటూ కాన వచ్చెను. మిత్రులు ఏదో ఆపద శంకించి బెదిరి పోయిరి. కాకి దగ్గరున్న చెట్టుపైకి ఎక్కెను. హిరణ్యకుడు తన కలుగు లోకి దూరెను. మందరకుడు కొలనులోకి జారుకొనెను. తమను తాము రక్షించుకున్నా కాని, వారి మనసున జింక కొచ్చిన యాపద తొలగించడమెలాగా యని చింతించు చుండిరి. “జింక కొచ్చిన యాపద యేమై యుండనోపు? కేవలం దాహముతో కొలను దగ్గరకు పరుగున వచ్చిందా? లేక వేటగాడెవరైనా వెంబడిస్తున్నాడా “యని పరి, పరి విధముల చింతించుచుండగా, ఆ హరిణము కొలను గట్టు వద్దకు చేరుకొనెను. అపుడు సరస్సులో దాగుకొన్న తాబేలు జింకను చూసి ఇటులడిగెను. “నీకు వచ్చిన యాపదేమి? ఈ విధంగా ఎందుకు పరుగు తీస్తున్నావు?” అనగా పరుగు యాపి జింక” నా పేరు చిత్రాంగుడు. వేటగాని బాణము బారి నుండి తప్పుకొని మరుగు కొరకు వెదుకుతూ పరుగిడుతున్నాను.” అని చెప్పింది. అప్పుడు మందరకుడు, “మన శాస్త్రాలు ఆపద నెదుర్కోవడానికి రెండు నీతి సూత్రాలు చెప్పాయి. మొదటిది ఆపదకు కారణమైన శత్రువును ఎదుర్కొని పోరాడడం. రెండోది పారిపోవడం. మొదటిది నీ శక్తికి మించింది కాబట్టి నీ శక్తి కొలది పరుగెట్టి ప్రాణాలు కాచుకో”
అప్పుడు చెట్టు పైన ఉన్న వాయసము, “చింత్రాంగా! భయము వీడు. నేనిక్కడనుంచి చూడ గలిగాను.వేటగాదు ఇంటి దారి పట్టాడు. నువ్వు ఇక్కడే ఉండి మా మిత్రులలో ఒకడివిగా హాయిగా ఉండు.ఈ మాటలు విన్న కొలను లోని తాబేలు, కలుగులొస్ని ఎలుక బయటకు వచ్చి, జింక భయాన్ని పోగొట్టి, జింకను తమ మిత్రులలో ఒకరిగా చేర్చుకొనిరి. ఆ నలుగురు మిత్రులూ కాలమే తెలియకుండా కబుర్లతో కాలక్షేపము చేస్తూ ఉన్నారు.

English: After passage of few days thus happily, one day even as the three friends were involved in animated conversation, there came running a deer with fear in his face. The three friends were scared of an imminent danger. The crow perched itself on the top of a tree, the mouse ran into its hole and the turtle escaped into the lake. Though they escaped to save themselves from danger their minds were anxious about the fate of the deer. They were speculating in their minds whether the deer came running for water or it was the fear of a hunter. As the deer reached the banks of the lake, the turtle asked it in hushed tone what the real danger that came upon the deer that he was running with fear. Then the deer replied that his name was Chitranga and that he escaped from the arrow of a hunter by a whisker. Then the turtle spoke to him of what the scriptures taught about the courage of action in times of danger. One was that the victim should face the enemy and defeat him. The second was to run away and save his life. As the deer was incapable of the former, the turtle advised him to run as fast as he can to save his life.

Then the crow perched on top of a tree said thus “From here, I could see that the hunter left for home. Now, Chintranga, leave your fear and stay with us as our friend“. Hearing this the mouse and turtle came out of their hiding places and made friends with the deer. The four friends were spending time in animated conversations.

§
104.
తిరిగి రాక పోయె హరిణి యొక దినము
మిత్ర త్రయము చింత మునిగి పోయె
మృగరాజు తినెనొ మడుగున పడెనొకొ
వలను చిక్కె నేమొ మరచి మరల! 104
§
105.
యనుచు దిగులు చెందె హరిణి రాకనె పోయె
కఛ్ఛపంబు బలికి కాకి తోన
మూషికమ్ము నేను మెల్లగ నడిచేము
వెగముగను నీవు యెగిరి చూడు! 105
§
106.
కొంత దూర మేగి కాకి కనె వేట
గాని వలలొ జింక కొట్టు కొనుచు
జాలి వీడి నన్ను కాలుడు వెంటాడు
యనుచు వగచె చాల హరిణి యయ్యొ! 106
§
107.
వాయసమ్ము పలికె వలదు చింత పడగ
యెగిరి పోయి తెత్తు ఎలుక మిత్రు
వలను పంట కొరికి విడిపించు వేగమె
యనుచు యెగిరి చనెను యెలుక చెంత! 107
§
108.
విటము వాయసమ్ము వీపుపై యెక్కగ
జింక చెంత చేరె జంట గాను
యెలుక కొరికె వలను యెంతయొ నేర్పుగ
జింక తప్పు కొనెను చింత బాసి! 108
§
109.
కృష్ణ శకుని పలికె గాలి మెకము గని
కలిసి రాదొ కట్టె కాటు వేయు
కాల మహిమ మనసు కాలుని తలచును
దైవ చింతె మంచి దారి చూపు! 109
§
110.
కూర్మ ముండ లేక కదిలెను నెమ్మది
మూషికమ్ము చూసి మదిని వగచె
కష్ట మొచ్చు నపుడు కలిసి నాలుగు వచ్చు
వేట గాడు వచ్చు వేగముగను! 110
§
111.
జింక నేను కాకి చనెదము వేగమె
కూర్మ మొండు తాను కదల లేదు
చిక్కు పడును వలను చాల కష్తమొచ్చె
కాతు నెటుల నేను కూర్మ మిత్రు! 111
§
112.
వేటకాడు వచ్చి వృత్తము వలవేసె
యెలుక చెప్పె యొక్క యుక్తి యిటుల
ప్రాణ మొదిలి నటుల పడ వలయును జింక
ప్లావి కనుల కాకి పొడవ వలయు! 112
§
113.
హరిణికుండు చూసి హరిణి పడి యుండ
సంతసమున పోయె జింక బట్ట
కశ్యపమ్ము నొదిలె కొలని గట్టు పయిన
యెరుగ డాయె మోస మెఱుక యిసుము! 113
§
114.
వేటగాని చూసి వాయసమ్ము యెగిరె
హరిణి కూడ యురికె హయము రీతి
యెలుక కొరికి పారె వలను కొరికి
కశ్చపమ్ము పోయె కొలను లోకి! 114
§
115.
బోయ వగచు కొనుచు పోయెను యింటికి
మిత్రు లొక్క చోట మరల చేరి
కబురు లాడు చుండ కాలమె తెలియదు
కాల మహిమ కాదె చెలులు దొరుక! 115
§
116.
మిత్ర లాభ మనెడు మంచి కధను చెప్పి
విష్ణు శర్మ తెలిపె శిష్యులకును
స్నేహితులను పొంది సుఖమున యుండుడి
జయము కలుగు మీకు జయము జయము! 116
§

తాత్పర్యము
ఒక రోజు ఆహారనికి వెళ్ళిన జింక ఎంత సెపటికి తిరిగి రాక పోయే సరికి, మిగిలిన ముగ్గురు మిత్రులు మిగుల చింత చెందిరి. “ఏ సింహమైనా మింగినదా, లేదా నీరు త్రావుతూ ఏ చెరువులోనైనా పడి కొట్టుకు పోయిందా లేక మరల ఏ వేటగాడి వలలొనైనా చిక్కుకున్నదా ” యని మిగుల చింతించిరి. ఎంత సేపు ఎదురు చూసినా జింక జాడ తెలియక పోవు సరికి, మందర్కుడు వాయసముతో, “మేమిరువురము చాలా నెమ్మదిగా నడుస్తాము. నువ్వు వాయు వేగముతో ఎగిరి పోయి, జింక జాడ తెలుసుకొని రమ్ము”
కాకి యటులనే కొంత దూరము ఎగిరి పోయి చూడగా, అక్కడ జింక ఒక వేటగాని వలలో చిక్కుపడి కానిపించెను. కాకిని చూసిన జింకకు దుఖము పొంగుకొచ్చి, ” యముడు జాలి లేక ఈ విధముగా నన్ను వెంటాడు తున్నాడు” యని వగచెను.
అపుడు కాకి, “నువ్వేమీ చింతపడకు. నేను ఇప్పుడే ఎగిరి పోయి మన మూషిక మిత్రుడిని తీసుకు వస్తాను. అతడు సునాయాసంగా వలను కొరికి నిన్ను రక్ధిస్తాడు” కాకి వేగంగా ఎలుక చెంతకు ఎగిరి వెళ్ళి మూపు పైన మిత్రుడిని ఎక్కించుకొని జింక యున్న చోట వాలెను, మూషికుడు వలను తన పళ్ళతో కొరికి జింకను కాపాడెను. జింక అత్యంత కృతఙ్ఞతతో వాయసమును చూసి, ” కాల మహిమో ఏమో కాని మనసు కాలునే తలచు చుండును. కాలము కలిసి రాక పోతే కర్ర పామై కరుస్తుందంటారు కదా. దైవ చింత తోడే నా యాపద తొలిగింది.”
ఇదిలా ఉండగా కూర్మము మనసు ఉండబట్టలేక నెమ్మదిగా నడుచుకుంటూ రా సాగెను. ఇది చూసి మూషికుడు, “కాల మహిమ అంటే ఇదే కాబోలు. కష్టాలు మూకుమ్మడిగా వస్తాయంటారు. వేటగాడు వేగంగా ఇటే వస్తున్నాడు. మేము ముగ్గురమూ తప్పించుకోగలము. కొలను పరిసరాలు దాటి వచ్చిన ఈ కూర్మము ఏ రీతి తప్పుకోగలదు? మిత్రుని నడక కూడా నెమ్మది”
ఇంతలో వేటగాడు వచ్చి వలను వేసి కూర్మమును పట్టివైచెను. అపుడు కాకి ఎగిరి వచ్చి ఒక ఉపాయము చెప్పెను. “కొలను గట్టుకి దగ్గరగా, జింక ప్రాణము విడిచినటుల పడి యుండ వలయును. నేను జింక కళ్ళను పొడుస్తూ ఉంటాను. వేటగానికి నమ్మకము కుదురుతుంది.” జింక, కాకి ఈ విధముగా చేయగనే వేటగాడు, జింక మరల దొరికిందన్న ఉత్సాహముతో, కూర్మమున్న వలను గట్టున వదిలేసి జింకను తెచ్చుకొన బోయెను. వేగంగా మూషికుడు వలను కొరుకగా, కూర్మము కొలనులోకి వెడలి పోయెను. వలను కొరికిన మూషికుడు కలుగులోకి పారి పోయెను. కాకి జింకను వదిలి ఎగిరి పోయెను. జింక లేచి పరుగు లంఘించుకొనెను. బోయగాడు ఈ వింతను చూది ఆశ్చర్యముతో, విచారముతో యింటి దారి బట్టెను.
మరల మిత్రులు నలుగురు కొలను ఒడ్డున చేరి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపము చేసిరి. ఆహా! కాల మహిమ ఎంత గొప్పది? మంచి మిత్రులు దొరకడ మంటే పూర్వ జన్మ ఫలమే కదా?
మిత్ర లాభమనే ఈ నీతి కధను చెప్పి, విష్ణు శర్మ శిష్యులకు మంచి మిత్రులను పొంది సుఖముగా ఉండండి యని చెప్పెను.

English: One day Chitranga, the deer went in search of food but did not return at the usual time. The three friends started getting anxious about his whereabouts. As anxiousness gives rise to depressing thoughts, the friends were thinking, “Did a lion swallow our friend? Or did she slip while drinking water in a lake and drown? Or did he fall prey to a hunter’s trap?

As the deer did not return after lapse of some time, the turtle said to the crow, “We two walk very slowly. You fly at your maximum speed and search our friend” Immediately the crow set out in search of the deer. Soon, he found the deer trapped in a hunters net. The deer wailed and said that the Lord of death seemed to have no mercy on him that He was haunting him. The crow solaced him with words of courage and told him that he would carry the mouse on his back and that he would cut the threads of the net with his sharp teeth in no time. So saying, he flew to where the mouse was coming running and carrying him on his back came to where the deer was trapped. The mouse, no sooner he saw the plight of his friend, cut the net with his teeth and freed the deer. The deer thanked his friends and said, “I do not know! But I always think that death is at my doorstep. They say that if time is not good even a stick bites like a serpent“.

In the meantime, the turtle anxious about his friends started walking slowly towards the place where his friends were. Looking at him the mouse wailed that troubles would come in droves. Now the hunter will trap the turtle with his net. As he feared the hunter lay his net and trapped the turtle. As the mouse was feeling sorry for his friend, the crow came and advised thus. “The deer will lay as if he were dead. I will be piercing his eyes to make the hunter believe he was really dead. The hunter, in his happiness will rush for the deer’s body. The mouse will cut the threads of the net and the turtle will escape. We too can run for our lives.

As advised, the deer lay on the lake bank as if dead. The crow pretended he was piercing his eyes. Feeling happy he got back his deer, the hunter left the net on the river banks and started walking to the deer. The mouse cut the net fast and the turtle escaped. The mouse escaped into his hole. The crow, seeing the hunter very near, flew away. Getting the hint the deer ran as fast as he can.

The hunter was surprised and dismayed at the turn of events and left the place dejected. The four friends were happy again to have been reunited and as usual spent time on the lake banks always happy and animated.

§
విష్ను శర్మ విరచిత “పంచ తంత్రము” యను నీతి కధలలో రెండవ నీతి “మిత్ర లాభము”

This is “Mitra Labhamu” part of “Panch Tantra” written by Vishnu Sarma in Sanskrit.

శుభం భూయాత్
Subham Bhuuyaat.

Click here to Buy this Book today!

About Chandra Mohanrao

An ex-banker, saw highs and lows in life, Presently spending time with children and grandchildren extensively traveling across India and Globe. Writing is a passion. Never did it for money, nor do I wish to do it. One critique and one word of appreciation is all what I want.

1 thought on “పంచతంత్రం STORIES OF PANCHATANTRA—Mitra Labhamu (Gaining Friends) Ch.6

Comments are closed.