వాణీ శతకం – రెండవ భాగము Vani Satakam – Part II

 

This is the second set (16-45) of the 200 poems I penned. First set available here. As my Poems will be published as a Book soon, a selection has been provided. The rest can be purchased in the complete dwisati via link to publisher’s website, at the end of the month.

17.
మొగని ముందుభార్య మోకరిల్లగ నేల
తాను కొన్న కూర తానె తరుగు
కూర కన్న నీకు కలద యెక్కుడిలువ
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

భర్త ముందు చేతులు కట్టుకొని నిలబడ వలసిన అవసర మేమొచ్చింది? తాను కొనుక్కున్న కూరగాయలు తరుక్కునే అధికారం తనకే కదా ఉంటుంది? కొనుక్కున్న భర్తకు కూరగాయల కంటే విలువ ఎక్కువ ఎందుకివ్వాలి?

English:

Why should a wife live subservient life before the husband? Is she not cleaning and cutting the vegetables she bought? What better value does a husband who was bought in marriage market carry?

18.
ఉందమన్న యాస యున్న యుగయుగాలు మనకు
ఉందమన్న వార లుండనీడు యముడు
పోదమన్న వార్కి పెరుగును యాయువు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించడం ఎవరికి సాధ్యం? మనము ఎన్ని యుగాలు బ్రతుకుతాదామనుకున్నా సమవర్తి సమయానికి తీసుకు వెళతాడు కదా? పోదామన్న వారికి ఆయువు పెరుగుతూనే వుంటుంది కదా?

English:

Who can escape his Karma? Those who want to live perennially will not, as the Lord of Death comes on the pre-destined date. For those who really want to live their lives to end, life span goes on increasing.

19
ఉన్న నాల్గు దినము లుపకారములు జేస
జన్మ రహిత పుణ్య జన్మ చాలు
నంచు నీవు సేయు నరుల సేవ నరుడ
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించుకోవాలంటే మరు జన్మ లేకుండా చేసుకోవడమే. అందుకే బ్రతికిన నాలుగు దినాలు ఇతరులకు ఉపకారము చేసి జన్మ రాహిత్యం కోసం నీవు పుణ్యము చేస్తూ దేవుణ్ణి ప్రార్ధించడమే మార్గం.

English: (How to escape this cycle of birth and death?)

If you want to rid of your Karma, it is through attaining Mukti, a state where you have no rebirth. For this, you should be helpful to the needy and do selfless service (nishkama karma) and pray the Gods to grant you such Mukti, freedom from birth-death cycle.

20.
నైజ ముప్పు కాగ నిజము నిప్పు వలెను
నిప్పు యందు పేలు యుప్పు నెపుడు
నీవు దాచు నిజము నిను బేల్చు నొకపరి
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నీ నైజం ఉప్పు లాంటిదైతే, నిజమనేది నిప్పు లాంటిది. ఉప్పు ఏదో ఒక రోజు నిప్పులో పేల్క తాపదు. అల్లాగె నీ నైజంలో నువ్వు దాచిన నిజము పేలి ఏదో ఒక రోజు నిన్ను పేల్చక తప్పదు.

English:

If your nature is like raw salt, truth is like fire. One day the truth you hid in your nature will crack in fire and break you into pieces.

21.
కదప కాలు రాక ముదుసలి యొక్కండు
సిగ్గు యెగ్గు లేక సోమ రొకడు
భార మెవరు యనుచు ధరణి యచ్చెరు వందె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కాలు కదప లేని ముసలి వాడొకడు, అన్నీ బాగుండి ఏ పనీ చేయని సోమరి పోతొకడు, వీళీద్దర్లో బ్నాకు భారమెవరని భూదేవి అచ్చెరువొందుతోందట!

English:

“Out these two, an old man confined to bed unable to do anything and a youth having all healthy limbs unwilling to do anything, who is more of a burden for me?” the Earth is lamenting.

22.
దైవ దర్శన మనుచు వడి వడిగ బోయి
మూఢ జనలు మండుటెండ నిలువ
గొప్ప జనులు గనిరి రెప్పపాటు నన్నిన్ను
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

దైవాన్ని దర్శించుకుందామని మూఢులైన పేద ప్రజలు త్వర త్వరగా పోయి మండుటెండలో గంటలు నిలబడితే, గొప్ప వారు క్షణంలో నీ దర్శనం చేసుకు పోతున్నారు కదయ్యా, శ్రీనివాసా?

English:

This is a telling poem on the situation prevailing in the Temples of Gods. “Even as illiterate, poor folks are running to see your image and are standing in the queues for hours, the Very, Very Important Persons are having your darshan (view) in seconds! Whither justice, Lord!”

23.
బతికి యున్న యపుడె భగవంతు దలచుము
పైకి బోయి చూడ ఫలము లేదు
ఉండి లేని వాని యునికి గను టెటుల
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

బ్రతికుండగానే భగవంతుణ్ణి తలుచుకో. ఎందు చేతనంటే, పోయాక ఉన్నాడో, లేడో తెలియని భగవంతుని కోసం ఎక్కడ వెదుకులాడుతావు? (భక్తి మార్గమే ముక్తి మార్గమని సూచన)

English:

Pray and try to see the God when you are living. Or else, after you die where can you search the One you do not know whether exists or not. (Bhakti (devotion) is, ultimately, the only way to attain Mukti (Salvation) )

24.
చెప్పె నీతు లెన్నొ చిల్లర దేవుడు
కాసు పుచ్చు కొనక కదలి రాడె
ఆస్తులెన్నొ వెనుక యవధానికి కనరో
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఈ మధ్య రోజుల్లో చాలా మంది ప్రవచన కర్తలు వివిధ వేద, వేదాంతాలపై ఉపన్యాసాలు దంచేస్తున్నారు. వీరు చెప్పే నీతుల్లో అరిష్డ్వర్గాలను విడవమనేది ముఖ్యం. ఈ శత్రు వర్గంలో లోభం, మోహం కూడా ఉన్నయి కదా? మరి ఈ ప్రవచన కర్తలు డబ్బు ముట్టందే కాలు కదుపుతారా? వీరికి వెనుక ఉన్న ఆస్తులెన్ని, వాటి మీద వ్యామోహమెంత? అనేది ఎవరు చూస్తున్నారు? తనకి పనికి రాని నీతి వేరే వారికి ఎలా పనికి వస్తుంది?

English:

Recently, many preachers are preaching non-stop the scriptures and their contents. Out of these, winning over the six enemies (kaama (desire), krodha (anger), lobha (miserliness), moha (attachment), mada (arrogance), maatsarya (jealousy)) is the main preaching. But, how many of these really move out of their homes if money is not offered as remuneration for the preaching? How many of them accumulated wealth and deeply attached to it. If they can’t get rid of attachment and miserliness, how can others follow them? How can morals that do not apply to them applies to others?

25.
ఆకలైన వాడె అసలైన సాధువు
కడుపు మాడ వాడె కాల ఙాని
సిరిని వదిలి చెప్పు శ్రీరంగ నీతులు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆకలైన వాడే అసలైన సన్న్యాసి. కడుపు మాడితే కాల ఙానం అదే వస్తుంది. ఈ సాధువులు , సంతులు, ప్రవచన కర్తలు వారి, వారి సిరిని దానం చేసి అప్పుడు నీతులు చెప్తే విన సొంపుగా ఉంటుంది.

English:

The hungry man is the Ascetic. When hunger burns the fuel inside, the Time Sense and preaching in the Holy Books automatically come to mind. These preachers and priests can donate their wealth and then preach, it will be precious to hear.

26.
మురికి వాడ యున్న ముదుసలి వినకున్న
వచన సార మెల్ల వ్యర్ధ మవదె
రాగ మిడక నీవు త్యాగము నేర్పెదో
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మురికి వాడల్లో దుర్భరంగా బ్రతుకు ఈడుస్తున్న ముసలి వాడు మీ ఙాన బోధ వినలేనప్పుడు మీ ప్రవచన సారం వ్యర్ధమే కదా? మీరు రాగ బంధాలు తెంచుకోకుండా ఇతరులకు త్యాగం నేర్పడం నవ్వుల పాలవడమే కదా! (కడు నిడిన ధనికులకు ఏమి చెప్పి ఏమి ప్రయోజనం)

English:

The old man living in the slums pathetically hears your preaching, is it not a waste of energy? Without you getting rid of your own attachments and sacrifice self, how can others do it on your boding. (What is the use of preaching selfish rich people, the art of sacrifice?)

28.
స్వఛ్ఛ భాష తోడె సమము దేశమవుగ
సంస్కృతమ్ము మనదు సంస్కృతి గదె
దేశ భాష నేర్వ దిమిదిమి దరువేల
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఒక స్వఛ్ఛమైన భాష దేశాన్ని ఏకం చేస్తుంది కదా? సంస్కృత భాష మన సంస్కృతిలో భాగమే కదా? మరి ఆ భాష నేర్చుకోడానికి ఈ దరువు లెందుకు? ( ఇంత గోల దేనికి అని అర్ధము)

English:

One chaste language unites the nation. Is not Sanskrit part of our culture? Then, why should we make it such a big issue?

30.
ధ్యాస యెటులొ మనదు భాషయు యటులనె
తప్పు సేయు వాడు తప్పు పలుకు
భాష శుద్ధ మయిన బతుకు శుద్ధ మగును
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మన ఆలోచనా సరళి ఎలా ఉంటుందో మన భాష అలాగే ఉంటుంది. తప్పు చేసిన వాడి నోట్లోనుంచే తప్పుడు, నీచమైన పదాలు వస్తాయి. మన భాష శుద్ధంగా ఉంటే మన జీవితాలు శుద్ధంగా ఉంటాయి.

English:

The way we think and act reflects in our language. If we commit mistakes and cover up, we tend to use harsh, un-parliamentary language. If our language is good, it shows our life is good and we think good.

33.
పేద కడుపు నింప బెనుగు లాడెడి వాడు
పెళ్ళి సేయ బెట్టు పెద్ద ఖర్చు
డాంబి కమ్ము నడుమ దయ యేడ దాగెనో
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పేద వాడికి ఇంత ముద్ద పెట్టి కడుపు నింపడానికి వెనుకాడే వాడు, పెళ్ళి మాత్రం మహా వైభోగంగా చేస్తాడు. (ఈ మధ్య పుట్టిన రోజులు, చీరలిచ్చే రోజులు, పంచెలిచ్చే రోజులు, ఉపనయనాల్లోనూ ఈ ఒరవడి ఎక్కవయింది). ఇంత డాబికం మధ్య “దయ” వెదుకుదామన్నా దొరకదే?

English:

The man who hesitates to give a bread piece to a poor, hungry guy spends lakhs and crores on pompous weddings. (Recently this trend spread to other functions too where wealth is displayed obnoxiously). Humanity is not found when searched with powerful lenses behind this vanity.

35.
తండ్రి చేసిన తప్పులు తనయు డెంచె
తనయు తనయుడు తండ్రినె తప్పు బట్టె
తరము మారిన మారదు తీర్పు యదియె
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తండ్రి చేసిన తప్పులు కొడుకు ఎంచుతాడు. అతని తనయుడు తన తండ్రి తప్పులు ఎంచుతాడు. తరాలు మారినా, తీర్పు ఒకటే కదా! (తనయుడు తండ్రి చేసింది సరి యయిన పనే అని తెలుసుకునే లోపలే నువ్వు చేసింది తప్పు నాన్నా అని చెప్పడానికి అతనికి ఇంకో తరం వాడు వస్తాడు)

English:

Son points out the mistakes of his father. His son points out his own mistakes. Though generations change judgment is one. (Taken from a quote “ By the time the son realizes that what his father did was right, he has a son who tells him he is wrong”).

36.
తల్లి వొడివేడి ఈ రోజు తలపు కొచ్చె
కంది పచ్చడి రుచికి కలలు కందు,
అమ్మ కలువ నాకు మనసు అయ్యె నేడు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తల్లి వొళ్ళో ఉండే వెచ్చదనం ఈ రోజు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఆమె చేసిన రోటి పచ్చడి, కంది పచ్చడి రుచి కలలో కొస్తున్నది. స్వర్గంలో ఉన తల్లిని వెళ్ళి త్వరగా కలుసుకోవాలని ఆశ కలుగుతోంది. (నాకూ వయసు మీరింది కదా. కాలు డొచ్చే కాలం దగ్గర కొచ్చింది కదా)

English:

Today, again I recollect the warmth of the bosom of my mother. I dream the taste of the Chutney (made with Taur Dal) in a grinding stone she used to make. (This is Andhra special. Eat with ghee. You can see Heaven on earth). How I wish I meet her in Heaven soon. (even I am of the age when the Lord of Death is awaiting my arrival there). This was written on International Mothers’ Day.

37.
పుత్రు డుండిన పిండము పెట్టు నంచు
యాడ పిండము ద్రుంచిరి యాది లోనె
భార్య లేకయె బిండము నేడు బెట్టు టెట్లు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

పుత్రుడు పుడితే పిండం పెట్టి పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని కొడుకుల కోసం చూసి ఆడ బిడ్డల్ని పుట్టకుండా చేస్తే మీ కొడుకులకి భార్య దొరకక పోతే, భార్య లేకుండా పిండం ఎలా పెడతాడు? పున్నామ నరకంతో పాటు, బిడ్డని చంపిన పాపానికి నరకం సిద్ధం కదా!

English:

Hoping that your son will protect you from the curse of birth and death and gives you Mukti, if you go on killing the girl child before birth or after, where do you bring wife for him? And without wife, how can he offer you obsequies and grant you Mukti. Instead, for killing the girl child, you will go to real hell.

39.
తెల్ల వన్నియు పాలను తేట వయసు
నల్ల వన్నియు నీరను నాటు వయసు
రెండు కళ్ళెగ జూసెదు రాత్రి పగలు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

లేత వయసులో తెల్లని వన్నీ పాలని నమ్ముతారు. మధ్య వయసొచ్చే సరికి మనిషి దెబ్బ తిని, ప్రతి విషయాన్ని అనుమానించడం మొదలు పెడతాడు. నల్లని వన్నీ నీరనుకుంటాడు. రాత్రిని, పగలును చూసేది ఆ రెండు కళ్ళే కదా? (ఙాన నేత్రంతో చూడ గలిగేదే నిజం. ఙాన సముపార్జనికి కృషి చేయాలి)

English:

During adolescence we believe all that is white is milk. As we grow, we gain experience through troubles and tribulations and start suspecting everything. We believe all that is black is water. (What we see through the inner eye, or wisdom, is only true. Hence gain wisdom.)

40.
చిత్త శుద్ధి లేని చిత్ర పూజ లదేల
చినుకు పడని చోట చత్ర మేల
వేడి పాల మీద వెన్న వెదుకు దేల
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నీకు చిత్త శుద్ధి లేకుండా ఎన్ని బొమ్మలు పెట్టుకొని దండాలు పెట్టి స్తోత్ర పాఠాలు చదివితే ఏమి ఉపయోగం? (పొయ్యాక తల్లిదండ్రుల బొమ్మలు పెద్ద చిత్రాలు గీయించి, దండాలు పెట్టే వాళ్ళు, వారు బ్రతికుండగా కనీసం పలకరించిన పాపాన పోరు). కనీసం ఒక చినుకు పడని చోట గొడుగు తీసుకు వెళ్ళినట్లే కదా? లేదా వేడి పాల మీద వెన్న కోసం వెదికినట్లే కదా?

English:

Without your conscience being clear, what is the use of adorning photos and praying to them? (There are people who might never have cared for their parents but make big paintings of them after they leave this world and shower their praises on them). Is it not like carrying an umbrella at a place where even a drop of rain does not fall? Or is it not like searching for butter on hot milk?

43.

ఎట్టి బరువు మోయ్క యాత్రలు చేసితి

వెట్టి వాని నొకని బెట్టి మోయ

పుణ్య మెవరి కొచ్చె గణియించి చూడరో

వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నువ్వు ఏలాంటి బరువు మోయకుండా ఒక వెట్టి వాణ్ణి పెత్తి, అతనికి జీత, భత్యాలు కూడా అతని శ్రమకు సరి పడా ఇవ్వకుండా పుణ్య క్షేత్రాలన్నీ తిరిగావు కదా? పుణ్య మెవరికొచ్చిందో తెలుసుకున్నవా? నీకు కాదు, కడుపు మాడ్చుకొని నీ బరువు మోసిన వాడికి.

English:

You went on pilgrimage. But, the weight you carry or your weight, you took the services of a worker whom you paid pittance. Do you think you got the blessings of God or the worker who carried your weight? (Certainly the latter, if you paid him less than what he deserved)

45.
సీస పద్యము
నంద వంశము బుట్ట నందుడు వివేకా
నందుడగునె వివేకమ్ము లేక
గాంధారి పుత్రుడు గాడ్రించి యరువగ
గాంధి యగునె సత్యవంతుడవక
కల్మష హృదయుడు కలల యందైనను
యెటగు కలాముగ యెపటి కయిన
మంద బుద్ధి సుతుడు మరువడె గతమును
గొర్రె మందను జేరి జనుచు వెనుక
ఆ: గొప్ప వారి సూక్తి జెప్పగా చింతించు
నీదు వయసు మనసు నీకు సాక్షి
నీరసించె నేమొ నిలుచుండి యోచించు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కొందరు ప్రబుద్ధులు, గొప్ప వారి సూక్తి ముక్తావళిని పదే, పదే ప్రచారం చేస్తారు కానీ వారు చెప్పిన ఒక్క సూక్తిని నిజ జీవితంలో పాటించిన పాపాన పోరు. (ఇది నాకు తెలిసిన కొంతమంది, నా దగ్గరి బంధు మిత్రుల నుద్దేశించి వ్రాసినది మాత్రమే). వారి నుద్దేసించి వ్రాసిన పద్యము.

నంద వంశంలో జన్మించిన ప్రతివాడు వివేకానందుడవుతాడా? గాంధారి పుత్రుడు ఎంత గట్టిగా అరిచినా, నిజాలు చెప్పకుండా గాంధీ అవుతాడా? మనసంతా కల్మషంతో ఉన్నవాడు కలలో నైనా కలాము అవుతాడా? దుర్మార్గుల వెనుక గొర్రె మందలో గొర్రెలా పోయే వాడు తన పూర్వీకుల వైభవాన్ని అర్ధం చేసుకో గలడా?

గొప్ప వారి సూక్తులను వల్లించేటప్పుడు, నీ వయసు, నీ మనసు నీకు సాక్షిగా నిలుస్తాయి. అవి కూడా వయసు మళ్ళి నీరసించినాయేమో ఒక్క సారి యోచించు.

English:

It has become a fashion for people to quote great people, without following their teachings. (Those that were very close to me like family members, whose characters, I know). This poem is intended to convey a message to such people.

Will a person born in Nanda dynasty become Vivekananda by his name? Will the son of Gandhari (here idiomatic reference to a crook) become Gandhi without following the path of truth, even if he shouts from rooftops, he is good? Will a man with adulterated mind turn into the great Abdul Kalaam even in his dream? Will not the nincompoop son, forget the glorious past of his own dynasty, by following the flock of sheep into the abyss?

You go on reciting the quotes of great people. But think once. Your age and your conscience are living proofs. Or are they so old that they are tired to think even?

About Chandra Mohanrao

An ex-banker, saw highs and lows in life, Presently spending time with children and grandchildren extensively traveling across India and Globe. Writing is a passion. Never did it for money, nor do I wish to do it. One critique and one word of appreciation is all what I want.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *